రక్తదానంపై అపోహలొద్దు: డాక్టర్ సురేఖా దేవి
రక్తదానంపై ఎలాంటి అనుమానాలు, అపోహలొద్దని డాక్టర్ ఎ.సురేఖా దేవి చెప్పారు. ఇవాళ ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆరోగ్యవంతులు, 10 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న వారెవరైనా రక్తదానం చేయవచ్చని సూచించారు. సురేఖాదేవి హైదరాబాదులోని గ్లోబల్ హాస్పిటల్ లోని ట్రాన్స్ ప్యూజన్ మెడిసిన్ విభాగంలో సేవలందిస్తున్నారు. ఒకసారి రక్తదానం చేసిన వారు తిరిగి 90 రోజుల తర్వాత మరోసారి చేయవచ్చని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రక్తదానం చేసే వారి సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోందన్నారు. ప్రతియేటా జూన్ 14న ప్రజల్లో రక్తదానం ఆవశ్యకతను తెలియజేయడంతో పాటు రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అవగాహన కల్పిస్తోందన్నారు. ఇప్పటికే 60 దేశాల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారి సంఖ్య పెరిగిందని ఆమె అన్నారు.